ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

హోమ్ › పోటీ పరీక్షలు › కరెంట్ అఫైర్స్

పరీక్షల ప్రిపరేషన్

పోటీ పరీక్షలు

APPSC · TGPSC · UPSC · SSC · బ్యాంకింగ్ · రైల్వే · పోలీస్ · DSC/TET · CTET

నవంబరు 11 కరెంట్ అఫైర్స్

నవంబరు 11, 2026 · పోటీ పరీక్షలకు పనికొచ్చే 10 ముఖ్యాంశాలు

తెలుగు స్కోప్ డెస్క్ · 10 నిమిషాల చదువు

UPSC కోసం 4 అంశాలు

  1. 01ఆరోగ్యంనవంబరు 9 · మూలం: NPPA, PIB

    క్యాన్సర్‌ మందుల కొత్త ఎంఆర్‌పీలు నవంబరు 9 నుంచి అమల్లోకి వచ్చాయి. 85 కంపెనీలు 121 ఔషధాలకు చెందిన 1,364 ఫార్ములేషన్ల ధరలను సవరించాయని NPPA ప్రకటించింది.

    గుర్తుంచుకోండిNPPA అంటే జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (National Pharmaceutical Pricing Authority). రోగులకు ఏటా రూ.3,540.38 కోట్లు ఆదా అవుతుందని తాజా అంచనా. అక్టోబరు 17 నాటి ఉత్తర్వు 137 క్యాన్సర్‌ ఔషధాలపై వ్యాపార మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. తయారీ సంస్థ స్టాకిస్టుకు ఇచ్చే ధరకు, ఎంఆర్‌పీకి మధ్య ఉన్న తేడానే ఈ మార్జిన్‌.

    • UPSC
    • APPSC
    • TGPSC
    • SSC
    మా కథనం
  2. 02ఆంధ్రప్రదేశ్నవంబరు 10 · మూలం: ఏపీ మంత్రివర్గం

    ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నవంబరు 10న 30కి పైగా ప్రతిపాదనలను ఆమోదించింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనాంలో 512 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌, తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4,000 కోట్ల బ్యాటరీ మెటీరియల్‌ పరిశ్రమ వీటిలో ఉన్నాయి.

    గుర్తుంచుకోండిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ పాలసీని 2026-31 కాలానికి తెచ్చారు. రోబోటిక్స్‌, ఫిజికల్‌ ఏఐ పాలసీ 2036 వరకు వర్తిస్తుంది. పోలీసు శాఖలో ట్రాఫిక్‌ నిర్వహణ, రహదారి భద్రత కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు కానుంది.

    • APPSC
    • UPSC
    • SSC
    • పోలీస్
    మా కథనం
  3. 03జనాభా లెక్కలునవంబరు 9 · మూలం: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర నోటిఫికేషన్‌

    2027 జనాభా లెక్కల (Census-2027) రెండో దశకు కేంద్రం అక్టోబరు 30న ఇచ్చిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. స్వీయ నమోదు 2027 జనవరి 10 నుంచి 24 వరకు, ఇంటింటి సేకరణ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతాయి.

    గుర్తుంచుకోండిమార్చి 1 నుంచి 5 వరకు సవరణల విడత (revisional round) ఉంటుంది. లెక్కలకు ప్రామాణిక తేదీ 2027 మార్చి 1 అర్ధరాత్రి, అంటే 00:00 గంటలు. జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్‌ 3 కింద కేంద్రం ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రెండో దశ ప్రశ్నావళిలో 40 ప్రశ్నలు ఉంటాయి.

    • UPSC
    • TGPSC
    • APPSC
    • SSC
    మా కథనం
  4. డైలీ క్విజ్

    చదివింది ఎంత గుర్తుందో చూడండి

    ఈ 10 అంశాల మీదే 10 ప్రశ్నలు. జవాబు, వివరణ వెంటనే. లాగిన్ అవసరం లేదు.

    క్విజ్ మొదలుపెట్టండి
  5. 07టెక్నాలజీనవంబరు 9 · మూలం: మెటా

    ఇన్‌స్టాగ్రామ్‌లో వయసును అంచనా వేసే సాంకేతికతను అన్ని దేశాలకూ విస్తరిస్తున్నట్లు మెటా నవంబరు 9న ప్రకటించింది. పుట్టిన తేదీ ఏది ఇచ్చినా, 18 ఏళ్లలోపు వారని అనుమానం వస్తే ఆ ఖాతా ‘టీన్‌ అకౌంట్‌’ రక్షణల్లోకి దానంతటదే మారిపోతుంది.

    గుర్తుంచుకోండిటీన్‌ అకౌంట్‌లో రోజులో 60 నిమిషాలు వాడాక యాప్‌ మూసేయాలని గుర్తు చేస్తుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నోటిఫికేషన్లు రావు. 16 ఏళ్లలోపు వారి ఖాతాలు ప్రైవేటుగా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌ వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ సాంకేతికతను 2025 ఏప్రిల్‌లో అమెరికాలో తొలిసారి పరీక్షించారు.

    • UPSC
    • SSC
    • APPSC
    • TGPSC
    మా కథనం

ఈ పేజీ ఎలా తయారవుతుంది

ప్రతి అంశం మేం ప్రచురించిన కథనం నుంచి లేదా అధికారిక ప్రకటన (PIB, RBI, CPCB, రాష్ట్ర ప్రభుత్వాలు) నుంచి తీసుకున్నది. సంఖ్యలు, తేదీలు అధికారిక పత్రంలో ఉన్నట్టే ఇస్తాం.

తప్పు కనిపిస్తే కాంటాక్ట్ పేజీ ద్వారా చెప్పండి. సరిచేసి, ఏం మార్చామో ఇదే పేజీలో రాస్తాం.