Original bilingual journalism · English & తెలుగు
హోమ్ › పోటీ పరీక్షలు › డైలీ క్విజ్
పరీక్షల ప్రిపరేషన్
పోటీ పరీక్షలు
APPSC · TGPSC · UPSC · SSC · బ్యాంకింగ్ · రైల్వే · పోలీస్ · DSC/TET · CTET
నవంబరు 11 డైలీ క్విజ్
నవంబరు 11 కరెంట్ అఫైర్స్ నుంచి 10 ప్రశ్నలు
- లాగిన్ అవసరం లేదు
- సుమారు 5 నిమిషాలు
- జవాబుతో పాటు వివరణ
- ప్రశ్న 1 / 10
NPPA ప్రకటన ప్రకారం క్యాన్సర్ మందులకు చెందిన 1,364 ఫార్ములేషన్ల ధరలను ఎన్ని కంపెనీలు సవరించాయి?
- A65
- B75
- C85
- D95
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: C. 85
85 కంపెనీలు 121 ఔషధాలకు చెందిన 1,364 ఫార్ములేషన్ల ధరలను సవరించాయి. అంతకు ఒక్క రోజు ముందు ఈ లెక్క 76 కంపెనీలు, 1,225 ఫార్ములేషన్లే.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 2 / 10
ఏపీ మంత్రివర్గం నవంబరు 10న ఆమోదించిన 512 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటయ్యే అమనాం ఏ జిల్లాలో ఉంది?
- Aవిశాఖపట్నం
- Bవిజయనగరం
- Cఅనకాపల్లి
- Dతిరుపతి
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: A. విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనాంలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు భూమి కేటాయించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఈప్యాక్ డేటా సెంటర్ యూనిట్‌కు అనుమతి లభించింది.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 3 / 10
2027 జనాభా లెక్కలకు ఏ తేదీ 00:00 గంటలను ప్రామాణికంగా తీసుకున్నారు?
- A2027 జనవరి 1
- B2027 జనవరి 25
- C2027 ఫిబ్రవరి 28
- D2027 మార్చి 1
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: D. 2027 మార్చి 1
లెక్కలకు ప్రామాణిక తేదీ 2027 మార్చి 1 అర్ధరాత్రి. ఇంటింటి సేకరణ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. మార్చి 1 నుంచి 5 వరకు సవరణల విడత (revisional round) ఉంటుంది.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 4 / 10
దోహా ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్, మను బాకర్, దివ్య సుబ్బరాజు జట్టు ఏ విభాగంలో స్వర్ణం గెలిచింది?
- Aమహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
- Bమహిళల 25 మీటర్ల పిస్టల్
- Cమహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
- Dమహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: B. మహిళల 25 మీటర్ల పిస్టల్
భారత జట్టు 1761 పాయింట్లు సాధించింది. దక్షిణ కొరియా (1748) రజతం, వియత్నాం (1745) కాంస్యం దక్కించుకున్నాయి. జట్టులో ఇషా సింగ్ అత్యధికంగా 590 పాయింట్లు సాధించింది.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 5 / 10
ఏపీలో CPS ఉద్యోగులు పాత పెన్షన్ పథకానికి మారాలంటే, ఏ తేదీకి ముందు నియామక ప్రకటన వెలువడి, ఆ తేదీన లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ఉండాలి?
- A2004 జనవరి 1
- B2004 ఏప్రిల్ 1
- C2004 సెప్టెంబరు 1
- D2005 జనవరి 1
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: C. 2004 సెప్టెంబరు 1
రాష్ట్రం 2004 సెప్టెంబరు 1 నుంచి నియమితులైన అందరికీ CPS అమలు చేసింది. కేంద్ర ఉద్యోగులకు జాతీయ పెన్షన్ విధానం 2004 జనవరి 1 నుంచి వర్తిస్తోంది. ఆప్షన్ ఇవ్వడానికి చివరి తేదీ 2026 డిసెంబరు 31.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 6 / 10
తెలంగాణలో సుమారు ఎన్ని మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించారు?
- A165
- B265
- C365
- D465
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: C. 365
31 జిల్లాల్లోని సుమారు 365 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని, యాసంగికి రూ.38,268 కోట్ల కొత్త రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి బ్యాంకులను కోరారు.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 7 / 10
ఇన్స్టాగ్రామ్ వాడేందుకు కనీస వయసు ఎంత?
- A12 ఏళ్లు
- B13 ఏళ్లు
- C16 ఏళ్లు
- D18 ఏళ్లు
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: B. 13 ఏళ్లు
ఇన్స్టాగ్రామ్ వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. 16 ఏళ్లలోపు వారి ఖాతాలు ప్రైవేటుగా ఉంటాయి. 18 ఏళ్లలోపు వారని అనుమానం వస్తే పుట్టిన తేదీ ఏదైనా టీన్ రక్షణలు వర్తిస్తాయి.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 8 / 10
ఏపీలో బాణసంచా భద్రతకు తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం స్టేట్ నోడల్ అథారిటీ ఎవరు?
- Aప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- Bపోలీసు డైరెక్టర్ జనరల్ (DGP)
- Cజిల్లా కలెక్టర్
- Dరాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: D. రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్
ఆయన నెలనెలా శాఖల మధ్య సమీక్ష నిర్వహించి, అమలు నివేదికలను హోం శాఖకు పంపాలి. జిల్లాల్లో కలెక్టరే నోడల్ అధికారి; ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 9 / 10
తెలంగాణలో మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం పొందడానికి రిటైలర్లు ఎవరికి ఇండెంట్ పెట్టాలి?
- Aజిల్లా పౌరసరఫరాల అధికారి
- Bజిల్లా కలెక్టర్
- Cజిల్లా వ్యవసాయ అధికారి
- Dజిల్లా తూనికలు, కొలతల అధికారి
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: A. జిల్లా పౌరసరఫరాల అధికారి
రిటైలర్లు ఇండెంట్ పెట్టాక మిల్లర్ల నుంచి సరఫరా ఏర్పాటు చేస్తారు. ధరలను అదుపులో ఉంచడమే లక్ష్యం.
ఈ అంశం, మా కథనం - ప్రశ్న 10 / 10
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికల్లో ఓటింగ్ ఏ పద్ధతిలో సాగుతుంది?
- Aరహస్య బ్యాలెట్
- Bఈవీఎం
- Cపోస్టల్ బ్యాలెట్
- Dచేతులెత్తే పద్ధతి
జవాబు, వివరణ చూడండి
సరైన జవాబు: D. చేతులెత్తే పద్ధతి
ఓటింగ్ చేతులెత్తే పద్ధతిలో సాగుతుంది. గుర్తింపు పొందిన పార్టీల సభ్యులు విప్ చెప్పినట్లే ఓటు వేయాలి; విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం పోతుంది.
ఈ అంశం, మా కథనం
అన్నీ రాశాక మీ స్కోర్ ఇక్కడ
ఇంకా 10 ప్రశ్నలు మిగిలాయి.
మీ జవాబులు ఈ ఫోన్లోనే ఉంటాయి, మాకు చేరవు. రేపటి క్విజ్ ఉదయం 7.30 గంటలకు.
ప్రశ్నలు ఎలా తయారవుతాయి
ప్రతి ప్రశ్నకు ఒక్కటే సరైన జవాబు ఉంటుంది. ఆ జవాబు మా కథనంలో లేదా అధికారిక ప్రకటనలో అక్షరాలా ఉన్నదే. ప్రచురించే ముందు మరొకరు మూలం చూసి మళ్లీ జవాబులు సరిచూస్తారు.

