ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

హోమ్ › పోటీ పరీక్షలు › కరెంట్ అఫైర్స్

పరీక్షల ప్రిపరేషన్

పోటీ పరీక్షలు

APPSC · TGPSC · UPSC · SSC · బ్యాంకింగ్ · రైల్వే · పోలీస్ · DSC/TET · CTET

నవంబరు 8 కరెంట్ అఫైర్స్

నవంబరు 8, 2026 · పోటీ పరీక్షలకు పనికొచ్చే 10 ముఖ్యాంశాలు

తెలుగు స్కోప్ డెస్క్ · 9 నిమిషాల చదువు

  • గత 7 రోజులు
  • సోమ2
  • మంగళ3
  • బుధ4
  • గురు5
  • శుక్ర6
  • శని7
  • ఆది8

TGPSC కోసం 6 అంశాలు

  1. 01ఎన్నికల సంఘంనవంబరు 6 · మూలం: భారత ఎన్నికల సంఘం

    SIR ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన పేర్లు ఫారం-6 లేకుండా, ఎన్యూమరేషన్ ఫారంతోనే మళ్లీ చేరవచ్చని ఎన్నికల సంఘం నవంబరు 6న ఏడు రాష్ట్రాలు, ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు (CEO) తెలిపింది. తెలంగాణలో గడువు నవంబరు 21.

    గుర్తుంచుకోండిSIR అంటే ప్రత్యేక ముమ్మర సవరణ (Special Intensive Revision). CEO అంటే ప్రధాన ఎన్నికల అధికారి (Chief Electoral Officer). ఏడుచోట్లా ముసాయిదాలో లేని పేర్లు 4.51 కోట్లు. వీటిలో తెలంగాణలో 73.39 లక్షలు, ఏపీలో 44.89 లక్షలు. తిరిగి చేరినవారికి పాత ఓటరు గుర్తింపు కార్డు (EPIC) సంఖ్యే కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల తుది జాబితా నవంబరు 30న వస్తుంది.

    • UPSC
    • APPSC
    • TGPSC
    • SSC
    మా కథనం
  2. 03రవాణానవంబరు 6 · మూలం: కేంద్ర రోడ్డు రవాణా శాఖ, NHAI

    నాలుగు వరుసలు, అంతకంటే పెద్ద జాతీయ రహదారులపై అడ్డంకుల్లేని (బ్యారియర్-ఫ్రీ) టోల్ ప్లాజాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒకే నమూనా ఖరారు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నవంబరు 6న తెలిపింది. ఈ విధానంలో వాహనాలు ఆగకుండానే టోల్ చెల్లిస్తాయి.

    గుర్తుంచుకోండిNHAI అంటే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways Authority of India). NHAI సర్క్యులర్ ప్రకారం నాలుగు వరుసల రోడ్డుకు 8, ఆరు వరుసలకు 10, ఎనిమిది వరుసలకు 12 టోల్ లేన్లు ఉంటాయి. గ్యాంట్రీపై ఉండే రీడర్లు ఫాస్టాగ్‌ను, కెమెరాలు నంబరు ప్లేటును చదువుతాయి.

    • UPSC
    • SSC
    • APPSC
    • TGPSC
    మా కథనం
  3. 04తెలంగాణనవంబరు 5 · మూలం: తెలంగాణ పౌర సరఫరాల శాఖ

    తెలంగాణ పౌర సరఫరాల శాఖ అక్టోబరు 29 నుంచి నవంబరు 5 వరకు బియ్యం వ్యాపారులపై తనిఖీలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ 1,141 ఆకస్మిక తనిఖీల్లో 55 కేసులు, తూనికలు కొలతల శాఖ (Legal Metrology) 1,545 తనిఖీల్లో 280 కేసులు నమోదు చేశాయి.

    గుర్తుంచుకోండిఅక్టోబరు 31న ఖరారైన గరిష్ఠ ధరలు: BPT/KNM కిలో రూ.66, RNR/తెలంగాణ సోనా రూ.74, HMT/JSR రూ.79. 26 కిలోల ప్రతి బస్తాపైనా ఈ గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) ఉండాలి. తనిఖీల్లో 26 కిలోలని రాసిన కొన్ని బస్తాల్లో 25 కిలోలే ఉన్నట్లు తేలింది.

    • TGPSC
    • పోలీస్
    మా కథనం
  4. 05వ్యవసాయంనవంబరు 7 · మూలం: తెలంగాణ ప్రభుత్వం

    ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరకు సాగుకు తొందరపడొద్దని, ఆరుతడి పంటలు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబరు 7న రైతులను కోరారు.

    గుర్తుంచుకోండికొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో భారీ రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించారు. అదే వేదికపై కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. లగచర్లను దిల్లీ-నొయిడా తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.

  5. డైలీ క్విజ్

    చదివింది ఎంత గుర్తుందో చూడండి

    ఈ 10 అంశాల మీదే 10 ప్రశ్నలు. జవాబు, వివరణ వెంటనే. లాగిన్ అవసరం లేదు.

    క్విజ్ మొదలుపెట్టండి
  6. 06ఖనిజాలునవంబరు 6 · మూలం: సింగరేణి

    కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) రంగంలో అమెరికా కంపెనీలతో కలిసి పని చేసేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి నవంబరు 6న హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ బృందానికి తెలిపారు.

    గుర్తుంచుకోండిఓపెన్‌కాస్ట్ గనుల ఓవర్‌బర్డెన్ మట్టి నుంచి అరుదైన భూ మూలకాలను (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) వెలికితీసే అవకాశాలు, కొత్తగూడెం జియో-సైన్స్ ల్యాబొరేటరీపై అమెరికా బృందం ఆసక్తి చూపింది. బొగ్గు తవ్వకం పూర్తయిన గనుల్లో పంప్డ్ స్టోరేజ్ కేంద్రాల నుంచి డేటా సెంటర్లకు విద్యుత్ ఇవ్వొచ్చని అధికారులు వివరించారు.

  7. 10తెలంగాణనవంబరు 6 · మూలం: తెలంగాణ అగ్నిమాపక శాఖ

    దీపావళికి తెలంగాణ అగ్నిమాపక శాఖ 7,601 టపాసుల లైసెన్సులు ఇచ్చింది. డీజీ విక్రమ్ సింగ్ మాన్ నవంబరు 6న ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్టీఆర్ స్టేడియం, నుమాయిష్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ ఎక్కువ ముప్పున్న ప్రాంతాలు.

    గుర్తుంచుకోండిసుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపావళి రాత్రి 10 గంటలకల్లా టపాసులు కాల్చడం ఆపాలని మల్కాజిగిరి జోన్ పోలీసులు చెప్పారు. 2025 దీపావళికి 8,019, 2024లో 7,516, 2023లో 6,439 తాత్కాలిక లైసెన్సులు ఇచ్చారు.

    • పోలీస్
    • TGPSC
    మా కథనం

ఈ పేజీ ఎలా తయారవుతుంది

ప్రతి అంశం మేం ప్రచురించిన కథనం నుంచి లేదా అధికారిక ప్రకటన (PIB, RBI, CPCB, రాష్ట్ర ప్రభుత్వాలు) నుంచి తీసుకున్నది. సంఖ్యలు, తేదీలు అధికారిక పత్రంలో ఉన్నట్టే ఇస్తాం.

తప్పు కనిపిస్తే కాంటాక్ట్ పేజీ ద్వారా చెప్పండి. సరిచేసి, ఏం మార్చామో ఇదే పేజీలో రాస్తాం.