ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

హోమ్ › పోటీ పరీక్షలు › కరెంట్ అఫైర్స్

పరీక్షల ప్రిపరేషన్

పోటీ పరీక్షలు

APPSC · TGPSC · UPSC · SSC · బ్యాంకింగ్ · రైల్వే · పోలీస్ · DSC/TET · CTET

నవంబరు 8 కరెంట్ అఫైర్స్

నవంబరు 8, 2026 · పోటీ పరీక్షలకు పనికొచ్చే 10 ముఖ్యాంశాలు

తెలుగు స్కోప్ డెస్క్ · 9 నిమిషాల చదువు

  • గత 7 రోజులు
  • సోమ2
  • మంగళ3
  • బుధ4
  • గురు5
  • శుక్ర6
  • శని7
  • ఆది8

పోలీస్ కోసం 4 అంశాలు

  1. 04తెలంగాణనవంబరు 5 · మూలం: తెలంగాణ పౌర సరఫరాల శాఖ

    తెలంగాణ పౌర సరఫరాల శాఖ అక్టోబరు 29 నుంచి నవంబరు 5 వరకు బియ్యం వ్యాపారులపై తనిఖీలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ 1,141 ఆకస్మిక తనిఖీల్లో 55 కేసులు, తూనికలు కొలతల శాఖ (Legal Metrology) 1,545 తనిఖీల్లో 280 కేసులు నమోదు చేశాయి.

    గుర్తుంచుకోండిఅక్టోబరు 31న ఖరారైన గరిష్ఠ ధరలు: BPT/KNM కిలో రూ.66, RNR/తెలంగాణ సోనా రూ.74, HMT/JSR రూ.79. 26 కిలోల ప్రతి బస్తాపైనా ఈ గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) ఉండాలి. తనిఖీల్లో 26 కిలోలని రాసిన కొన్ని బస్తాల్లో 25 కిలోలే ఉన్నట్లు తేలింది.

    • TGPSC
    • పోలీస్
    మా కథనం
  2. డైలీ క్విజ్

    చదివింది ఎంత గుర్తుందో చూడండి

    ఈ 10 అంశాల మీదే 10 ప్రశ్నలు. జవాబు, వివరణ వెంటనే. లాగిన్ అవసరం లేదు.

    క్విజ్ మొదలుపెట్టండి
  3. 08క్రీడలునవంబరు 6 · మూలం: ICC

    పేసర్ మహ్మద్ షమీ నవంబరు 6న టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2013లో సరిగ్గా ఇదే తేదీన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతాడు.

    గుర్తుంచుకోండి64 టెస్టుల్లో 27.71 సగటుతో 229 వికెట్లు తీశాడు. భారత పేసర్లలో ఆరో స్థానం. అతడికంటే ముందు కపిల్ దేవ్ (434), జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (చెరో 311), జవగళ్ శ్రీనాథ్ (236), జస్ప్రీత్ బుమ్రా (234) ఉన్నారు. ఆఖరి టెస్టు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తుది పోరు.

    • SSC
    • రైల్వే
    • బ్యాంకింగ్
    • పోలీస్
    మా కథనం
  4. 09క్రీడలునవంబరు 7 · మూలం: BCCI

    వెలింగ్టన్‌లో నవంబరు 7న వర్షంతో ఆగిన రెండో వన్డేలో భారత్ DLS పద్ధతిలో న్యూజిలాండ్‌పై 4 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.

    గుర్తుంచుకోండిDLS అంటే డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (Duckworth-Lewis-Stern). న్యూజిలాండ్ 134కు ఆలౌట్. గుర్నూర్ బ్రార్ 4/30. 135 లక్ష్య ఛేదనలో భారత్ 26 ఓవర్లకు 113/7తో ఉండగా వర్షం వచ్చింది. అప్పటి DLS పార్ స్కోరు 109. మూడో వన్డే నవంబరు 10న హామిల్టన్‌లో.

    • SSC
    • రైల్వే
    • పోలీస్
    మా కథనం
  5. 10తెలంగాణనవంబరు 6 · మూలం: తెలంగాణ అగ్నిమాపక శాఖ

    దీపావళికి తెలంగాణ అగ్నిమాపక శాఖ 7,601 టపాసుల లైసెన్సులు ఇచ్చింది. డీజీ విక్రమ్ సింగ్ మాన్ నవంబరు 6న ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్టీఆర్ స్టేడియం, నుమాయిష్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ ఎక్కువ ముప్పున్న ప్రాంతాలు.

    గుర్తుంచుకోండిసుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపావళి రాత్రి 10 గంటలకల్లా టపాసులు కాల్చడం ఆపాలని మల్కాజిగిరి జోన్ పోలీసులు చెప్పారు. 2025 దీపావళికి 8,019, 2024లో 7,516, 2023లో 6,439 తాత్కాలిక లైసెన్సులు ఇచ్చారు.

    • పోలీస్
    • TGPSC
    మా కథనం

ఈ పేజీ ఎలా తయారవుతుంది

ప్రతి అంశం మేం ప్రచురించిన కథనం నుంచి లేదా అధికారిక ప్రకటన (PIB, RBI, CPCB, రాష్ట్ర ప్రభుత్వాలు) నుంచి తీసుకున్నది. సంఖ్యలు, తేదీలు అధికారిక పత్రంలో ఉన్నట్టే ఇస్తాం.

తప్పు కనిపిస్తే కాంటాక్ట్ పేజీ ద్వారా చెప్పండి. సరిచేసి, ఏం మార్చామో ఇదే పేజీలో రాస్తాం.