Original bilingual journalism · English & తెలుగు
OPT fee: 70,000 డాలర్ల ప్రతిపాదనపై comments గడువు నవంబర్ 10 ఉదయం 10.29 (IST)తో ముగింపు; 7,100 దాటిన comments
అమెరికాలో F-1 విద్యార్థుల OPT కోసం కాలేజీలు ఒక్కొక్కరికి 70,000 డాలర్లు కట్టాలన్న DHS ప్రతిపాదనపై comments గడువు నవంబర్ 10 మంగళవారం ఉదయం 10.29 (IST)కి ముగుస్తుంది. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది.

అమెరికాలో F-1 visa పై చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన OPT fee ప్రతిపాదనపై comments గడువు దగ్గరపడింది. US Eastern time ప్రకారం నవంబర్ 9 సోమవారం రాత్రి 11.59కి గడువు ముగుస్తుంది. మన దగ్గర అప్పటికి నవంబర్ 10 మంగళవారం ఉదయం 10.29 అవుతుంది. నవంబర్ 9 తెల్లవారుజామున 4.25 గంటలకు (IST) Federal Register చూపిన లెక్క ప్రకారం ఈ ప్రతిపాదనపై 7,101 comments నమోదయ్యాయి. నవంబర్ 8 తెల్లవారుజామున 3.25కి (IST) ఆ సంఖ్య 6,848.
ప్రతిపాదనలో ఏముంది
US Department of Homeland Security (DHS) ఈ ప్రతిపాదనను అక్టోబర్ 8న Federal Register లో ప్రచురించింది. దీని ప్రకారం SEVP certification ఉన్న కాలేజీ ఒక విద్యార్థికి మొదటిసారి OPT recommend చేసే ముందే 70,000 డాలర్లు చెల్లించాలి. చదువు పూర్తి కాకముందు తీసుకునే OPT అయినా, పూర్తయ్యాక తీసుకునేది అయినా ఇదే లెక్క. ఆ తర్వాత ప్రతి OPT కి మరో 30,000 డాలర్లు. 24 నెలల STEM extension కూడా ఇందులోకే వస్తుంది. fee చెల్లించే వరకు USCIS work permit మంజూరు చేయదు.
ఈ fee కట్టాల్సింది కాలేజీలే. అయితే ఆ భారాన్ని కాలేజీలు విద్యార్థులపైనో, employers పైనో వేయవచ్చని DHS తన notice లోనే పేర్కొంది. US ప్రభుత్వ SEVIS by the Numbers 2024 report ప్రకారం 2024లో అమెరికాలో భారత విద్యార్థుల records 4,22,335. ఏ దేశానికీ ఇన్ని లేవు. అదే ఏడాది STEM OPT లో ఉన్న 1,65,524 మందిలో 48 శాతం మంది భారతీయులే.
ఇప్పుడేమీ మారదు
ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. పరిశీలన జరుగుతున్నంత కాలం విద్యార్థులకు ఏ నిబంధనా మారదు. final rule అమల్లోకి వచ్చిన రోజు లేదా ఆ తర్వాతి తేదీతో ఇచ్చే OPT recommendations కే fee వర్తిస్తుంది. అంతకుముందు తేదీతో ఇచ్చిన recommendations కు ఈ fee ఉండదు. వచ్చిన comments ను DHS పరిశీలించిన తర్వాతే final rule వస్తుంది. అది ప్రచురించిన 60 రోజులకు అమల్లోకి రావాలని DHS ప్రతిపాదించింది.
More Stories
NRIఉజ్బెకిస్తాన్‌లో ఎంబీబీఎస్: ఎన్ఎంసీ నిబంధనల ప్రకారమే చదువు ఉండాలన్న కేంద్రం; భారీగా తగ్గిన భారత విద్యార్థుల ప్రవేశాలు
NRIసౌదీ దమ్మామ్ విమానాశ్రయంపై దాడి: ఇద్దరి మృతి, మృతుల్లో భారతీయుడు; బాధిత కుటుంబాలతో రాయబార కార్యాలయం సంప్రదింపులు
NRIగ్రీన్‌కార్డ్ నియామకాల్లో వీసాదారులకు మొగ్గు ఆరోపణలు: 50 లక్షల డాలర్లు చెల్లించేందుకు ఇన్‌స్టాకార్ట్ అంగీకారం
NRIసౌదీకి భారత విమానాలు ఇంకా బంద్; దాడి జరిగితే వెంటనే భవనాల్లోకి వెళ్లండి: రాయబార కార్యాలయం
NRIదుబాయ్ నుంచి వియన్నా దాకా.. ఖండాంతరాల్లో బతుకమ్మ, దసరా సంబరాలు
NRI‘ఇండెంచర్డ్ సర్వెంట్స్’ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన వాన్స్; ఎనిమిది టెక్ సంస్థలపై గ్రీన్‌కార్డ్ నిలిపివేత యథాతథం
