Original bilingual journalism · English & తెలుగు
తిరుమల జలాశయాల్లో 40 లక్షల గ్యాలన్లకు పైగా పెరిగిన నీరు: టీటీడీ లెక్కలు
అక్టోబర్ 23 ఉదయం టీటీడీ లెక్కల ప్రకారం తిరుమలలోని ఐదు జలాశయాల్లోకి 61.68 లక్షల గ్యాలన్ల నీరు చేరగా, 21.60 లక్షల గ్యాలన్లు వాడారు. కుమారధారలో ఎక్కువ పెరిగింది.

తిరుమల కొండపై ఉన్న ఐదు జలాశయాల్లోకి 61.68 లక్షల గ్యాలన్ల నీరు చేరిందని, 21.60 లక్షల గ్యాలన్లు వినియోగమయ్యాయని అక్టోబర్ 23 ఉదయం నాటి టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద 40.08 లక్షల గ్యాలన్లు పెరిగాయి.
జలాశయాలవారీగా చేరిన నీరు: కుమారధారలో 25.14 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 20.96, గోగర్భంలో 9.25, ఆకాశగంగలో 6.33. పసుపుధారలో మార్పు లేదు.
ఆ ఉదయం నిల్వలు (లక్షల గ్యాలన్లలో; బ్రాకెట్‌లో పూర్తి సామర్థ్యం):
- పాపవినాశనం: 2,688.35 (5,240)
- గోగర్భం: 508.31 (2,833.10)
- కుమారధార: 363.98 (4,259.01)
- ఆకాశగంగ: 30.40 (685)
- పసుపుధార: 24.38 (1,287.54)
ఆకాశగంగ ఆనకట్ట పరిసరాల్లో 8 మి.మీ. వర్షం కురిసింది. సెప్టెంబర్ 15 నుంచి జలాశయాల్లోకి మొత్తం 244.46 లక్షల గ్యాలన్ల నీరు చేరింది. వీటిలో నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షలు, సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02 లక్షల గ్యాలన్లు ఉన్నాయి.
More Stories
Andhra Pradesh26కల్లా తుపానుగా అల్పపీడనం; 27, 28న కోస్తాంధ్రకు భారీ వర్షాలు
Andhra Pradesh36 ప్రాజెక్టులు 2028 డిసెంబర్‌కల్లా పూర్తికావాలి; నవంబర్‌లో చింతలపూడి పనులు పునఃప్రారంభం: సీఎం
Andhra Pradeshఏపీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల వద్దే ఘర్షణలు: 2021, 2026 రికార్డు ఏం చెబుతోంది
Andhra Pradeshఅక్టోబర్ 26న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం: జలాల పంపిణీ, శ్రీశైలం వినియోగంపై చర్చ
Andhra Pradeshకత్తిపూడి వద్ద భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం: కనీసం నలుగురి మృతి
Andhra Pradeshఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027: ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు