Original bilingual journalism · English & తెలుగు
దీపావళి విడుదలలు: నవంబర్ 5న తెలుగులో ‘రామాయణ’, 6న ‘సమ్మర్ హాలిడేస్’, ‘మహాశక్తి’; ఓటీటీలోకి ‘అనకాపల్లి’, ‘బాలు గీత’
నితేశ్ తివారీ 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5 గురువారం సాధారణ టికెట్ ధరలతో ఏపీ, తెలంగాణ థియేటర్లలోకి వస్తోంది. 'అనకాపల్లి' నవంబర్ 3న సన్ నెక్స్ట్‌లో, 'బాలు గీత' నవంబర్ 5న ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతాయి.

దీపావళి విడుదలలు నవంబర్ 5 గురువారం మొదలవుతున్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ‘రామాయణ: పార్ట్ 1′ ఆ రోజు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వస్తోంది. పండుగ నవంబర్ 8 ఆదివారం. ఈలోగా శుక్రవారం మరో రెండు సినిమాలు థియేటర్లకు, నాలుగు చిత్రాలు ఓటీటీకి వస్తున్నాయి.
రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, రావణుడిగా యశ్ నటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. రెండో భాగం 2027 దీపావళికి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) ఈ సినిమాను విడుదల చేస్తోంది.
టికెట్ ధరలు మామూలుగానే
ధరల పెంపు కోసం ఎస్వీసీ ప్రభుత్వాల దగ్గరకు వెళ్లలేదు. ఏపీ మల్టీప్లెక్స్‌లలో టికెట్ సుమారు రూ.177. త్రీడీకి రూ.25 అదనం. హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ధర రూ.200 నుంచి రూ.295 వరకు ఉంది.
శుక్రవారం వస్తున్న తెలుగు సినిమా ‘సమ్మర్ హాలిడేస్‘. శ్రీకర్ దర్శకుడు, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత. ర్యాంకుల కోసం నాన్న ఒత్తిడి చేసే పట్నం పిల్లాడు ఆర్వీ, పుస్తకాలంటే గిట్టని పల్లెటూరి పిల్లాడు కేవీ కలిసే కథను ట్రైలర్ చూపించింది. మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, మాస్టర్ రోహన్ ఈ పాత్రలు చేశారు. అమ్మమ్మగా జయసుధ, ముఖ్య పాత్రలో రాజీవ్ కనకాల కనిపిస్తారు. అదే రోజు సుందర్ సి తీసిన ‘మూకుత్తి అమ్మన్ 2′ తెలుగులో ‘మహాశక్తి‘గా వస్తోంది. ఇందులో అమ్మవారిగా నయనతార మళ్లీ కనిపిస్తారు.
ఓటీటీలో ఇవీ
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ఠ జంటగా ఖగేశ్ తమ్మినేని తీసిన ‘అనకాపల్లి‘ నవంబర్ 3 మంగళవారం నుంచి సన్ నెక్స్ట్‌లో అందుబాటులో ఉంటుంది. పల్లె నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ప్రతాప్ కొల్లా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ ‘బాలు గీత‘ నవంబర్ 5 గురువారం ఈటీవీ విన్‌లోకి వస్తోంది.
More Stories
Moviesనెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి టాక్ షో ‘మెగావర్స్’: వ్యాఖ్యాతగా మెగాస్టార్, చిత్రీకరణ మొదలు
Moviesఈఎన్ఈ రిపీట్ ట్రైలర్: ఈసారి పూర్తి సినిమా తీసే పనిలో ‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్; నవంబర్ 19న విడుదల
Movies‘పాకెట్ రాకెట్స్’ ఫస్ట్ హ్యాండ్ గ్లింప్స్ విడుదల: నిహారిక కొణిదెల నిర్మాణంలో జూదం కథ, డిసెంబర్ 11న థియేటర్లలోకి
OTTబత్తా రివ్యూ: విజయ్ సేతుపతి, చిన్నారి నటనతో మెరిసిన సింపుల్ కథ; నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో
Moviesఆదర్శ కుటుంబం తొలి రోజు వసూళ్లు: ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.16 కోట్ల గ్రాస్
Moviesజైలర్ 2 బాక్సాఫీస్: 14 రోజుల్లో దేశంలో దాదాపు రూ.495 కోట్ల గ్రాస్; రూ.500 కోట్ల మార్కుకు చేరువలో