Original bilingual journalism · English & తెలుగు
గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్-2.. ముందస్తు ఉపసంహరణ ధర యూనిట్‌కు రూ.13,345
సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్-2ను గురువారం (నవంబరు 19) ముందస్తుగా ఉపసంహరించుకునే వారికి యూనిట్‌కు రూ.13,345 చెల్లిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది.

ముంబయి: సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2020-21 సిరీస్-2లో పెట్టుబడి పెట్టిన వారికి ముందస్తు ఉపసంహరణ అవకాశం వచ్చింది. గురువారం (నవంబరు 19) బాండ్లను వెనక్కి ఇచ్చే వారికి యూనిట్‌కు రూ.13,345 చెల్లిస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) బుధవారం ప్రకటించింది. ఒక యూనిట్ అంటే ఒక గ్రాము బంగారం.
ఉపసంహరణకు ముందు మూడు పనిదినాలు.. నవంబరు 16, 17, 18 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించిన 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ ధర నిర్ణయించారు.
ఎవరు, ఎప్పుడు?
ఈ సిరీస్ బాండ్లు 2020 మే 19న జారీ అయ్యాయి. నిబంధనల ప్రకారం జారీ తేదీ నుంచి ఐదేళ్లు దాటాక, వడ్డీ చెల్లించే తేదీల్లో మాత్రమే ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు. ఆ లెక్కన ఈ సిరీస్‌కు తదుపరి అవకాశం నవంబరు 19 అని ఆర్‌బీఐ తెలిపింది.
గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ముందస్తుగా ఉపసంహరించుకోని వారికి గడువు ముగిసినప్పుడు అప్పటి బంగారం ధర ప్రకారం సొమ్ము అందుతుంది.
More Stories
Businessఅందని డివిడెండ్లకు దిల్లీలో ‘నివేశక్ శివిర్’.. 17న
Businessనవంబరు 18న ట్రెజరీ బిల్లుల వేలం.. సామాన్యులకూ అవకాశం
Andhra Pradeshకియా రెండో ప్లాంటు.. 2030 ఆరంభంలో ఉత్పత్తి
Andhra Pradeshఏపీ, తెలంగాణ చెరో రూ.1,000 కోట్ల రుణం.. 17న వేలం
Businessఅక్టోబరులో వస్తు ఎగుమతులు 45% వృద్ధి.. పెట్రోలియం ఉత్పత్తుల జోరు
Businessవిదేశీ మారక నిల్వలు 719.55 బిలియన్ డాలర్లకు.. పసిడి దన్ను
