Original bilingual journalism · English & తెలుగు
విదేశీ మారక నిల్వలు 71,706 కోట్ల డాలర్లకు: వరుసగా రెండో వారమూ తగ్గుదల, బంగారం విలువకూ కోత
అక్టోబర్ 30తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 269 కోట్ల డాలర్లు తగ్గాయని RBI వెల్లడించింది. రూపాయల్లో వీటి విలువ రూ.68.09 లక్షల కోట్లు.

దేశ విదేశీ మారక నిల్వలు వరుసగా రెండో వారమూ తగ్గాయి. అక్టోబర్ 30 శుక్రవారంతో ముగిసిన వారంలో 269 కోట్ల డాలర్లు తగ్గి 71,706 కోట్ల డాలర్లకు ($717.06 billion) చేరాయి. RBI నవంబర్ 6 శుక్రవారం విడుదల చేసిన వారపు లెక్కల్లో ఈ వివరాలు ఉన్నాయి. రూపాయల్లో ఈ నిల్వల విలువ రూ.68.09 లక్షల కోట్లు.
అక్టోబర్ 23తో ముగిసిన వారంలోనూ నిల్వలు 127 కోట్ల డాలర్లు తగ్గి 71,975 కోట్ల డాలర్ల వద్ద నిలిచాయి. తాజా కోతలో పెద్ద వాటా విదేశీ currency ఆస్తులదే. ఇవి 208.8 కోట్ల డాలర్లు తగ్గి 59,112 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.
బంగారం విలువకూ కోత
RBI దగ్గర ఉన్న బంగారం నిల్వల విలువ అదే వారంలో 55.9 కోట్ల డాలర్లు తగ్గి 10,259 కోట్ల డాలర్లకు చేరింది. రూపాయల్లో ఇది రూ.9.74 లక్షల కోట్లు. అంతకుముందు వారం ఈ తగ్గుదల 265 కోట్ల డాలర్లు. మార్చి ఆఖరుతో పోలిస్తే బంగారం విలువ 1,280.5 కోట్ల డాలర్లు తక్కువ. మొత్తం నిల్వలు మాత్రం మార్చి ఆఖరు కంటే 2,595 కోట్ల డాలర్లు, ఏడాది క్రితం ఇదే సమయం కంటే 2,732 కోట్ల డాలర్లు ఎక్కువగానే ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ అప్పులు
రాష్ట్రాలు bonds అమ్మి అప్పు తీసుకునే వేలాన్ని కూడా RBIయే నిర్వహిస్తుంది. నవంబర్ 3 మంగళవారం జరిగిన వేలంలో ఆంధ్రప్రదేశ్ రూ.3,000 కోట్లు సేకరించింది. 2035లో తీరే bondsపై రూ.1,000 కోట్లకు 8.0089 శాతం, 2056లో తీరే bondsపై రూ.2,000 కోట్లకు 8.1463 శాతం yield ఖరారైంది. తెలంగాణ 20 ఏళ్లు, 26 ఏళ్ల గడువుతో చెరో రూ.1,500 కోట్లు తీసుకుంది. వీటిపై వడ్డీ వరుసగా 8.17, 8.15 శాతం.
నవంబర్ 9 సోమవారం జరిగే వేలంలో 11 రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ కలిసి రూ.29,050 కోట్లు సేకరించనున్నాయి. ఆ జాబితాలో ఏపీ, తెలంగాణ లేవు. ఫలితాలను RBI అదే రోజు ప్రకటిస్తుంది.
More Stories
Businessసింగరేణితో జట్టుకు అమెరికా కంపెనీల ఆసక్తి: critical minerals, data centres పై US Consulate బృందం చర్చలు
Businessదీపావళి Muhurat Trading నవంబర్ 8 మధ్యాహ్నం 2.20కి: 81,028 వద్ద Sensex, 25,000 దాటిన Nifty; నవంబర్ 10న marketకు సెలవు
Businessఅనంతపురం కియా ప్లాంట్ విస్తరణకు రూ.14,167 కోట్ల ప్రణాళిక: ఏటా 5 లక్షల కార్ల సామర్థ్యం దిశగా, విశాఖ సదస్సులో ఒప్పందానికి అవకాశం
Businessసెన్సెక్స్ 2,009 పాయింట్ల జంప్, 79,310 వద్ద ముగింపు: అమెరికా ఫలితాలు, చమురు ధరల తగ్గుదలతో జోరు
Businessబంగారు నగ కొనే ముందు హెచ్‌యూఐడీ సరిచూసుకోండి: బీఐఎస్ కేర్ యాప్‌లో నగ ఫొటో, బరువు కూడా
Businessలిథియం, నికెల్ శుద్ధి ప్లాంట్లకు కేంద్రం రూ.2,814 కోట్లు: నాలుగు ప్లాంట్లకు 30 శాతం మూలధన సబ్సిడీ