ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

హోమ్ › పోటీ పరీక్షలు › డైలీ క్విజ్

పరీక్షల ప్రిపరేషన్

పోటీ పరీక్షలు

APPSC · TGPSC · UPSC · SSC · బ్యాంకింగ్ · రైల్వే · పోలీస్ · DSC/TET · CTET

నవంబరు 11 డైలీ క్విజ్

నవంబరు 11 కరెంట్ అఫైర్స్ నుంచి 10 ప్రశ్నలు

ముందు 10 అంశాలు చదవండి

  • లాగిన్ అవసరం లేదు
  • సుమారు 5 నిమిషాలు
  • జవాబుతో పాటు వివరణ
  1. ప్రశ్న 1 / 10
    • UPSC
    • APPSC
    • TGPSC
    • SSC

    NPPA ప్రకటన ప్రకారం క్యాన్సర్‌ మందులకు చెందిన 1,364 ఫార్ములేషన్ల ధరలను ఎన్ని కంపెనీలు సవరించాయి?

    1. A65
    2. B75
    3. C85
    4. D95
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: C. 85

    85 కంపెనీలు 121 ఔషధాలకు చెందిన 1,364 ఫార్ములేషన్ల ధరలను సవరించాయి. అంతకు ఒక్క రోజు ముందు ఈ లెక్క 76 కంపెనీలు, 1,225 ఫార్ములేషన్లే.

    ఈ అంశం, మా కథనం
  2. ప్రశ్న 2 / 10
    • APPSC
    • UPSC
    • SSC
    • పోలీస్

    ఏపీ మంత్రివర్గం నవంబరు 10న ఆమోదించిన 512 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటయ్యే అమనాం ఏ జిల్లాలో ఉంది?

    1. Aవిశాఖపట్నం
    2. Bవిజయనగరం
    3. Cఅనకాపల్లి
    4. Dతిరుపతి
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: A. విశాఖపట్నం

    విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనాంలో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌కు భూమి కేటాయించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఈప్యాక్‌ డేటా సెంటర్‌ యూనిట్‌కు అనుమతి లభించింది.

    ఈ అంశం, మా కథనం
  3. ప్రశ్న 3 / 10
    • UPSC
    • TGPSC
    • APPSC
    • SSC

    2027 జనాభా లెక్కలకు ఏ తేదీ 00:00 గంటలను ప్రామాణికంగా తీసుకున్నారు?

    1. A2027 జనవరి 1
    2. B2027 జనవరి 25
    3. C2027 ఫిబ్రవరి 28
    4. D2027 మార్చి 1
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: D. 2027 మార్చి 1

    లెక్కలకు ప్రామాణిక తేదీ 2027 మార్చి 1 అర్ధరాత్రి. ఇంటింటి సేకరణ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. మార్చి 1 నుంచి 5 వరకు సవరణల విడత (revisional round) ఉంటుంది.

    ఈ అంశం, మా కథనం
  4. ప్రశ్న 4 / 10
    • SSC
    • రైల్వే
    • TGPSC
    • బ్యాంకింగ్

    దోహా ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్‌, మను బాకర్‌, దివ్య సుబ్బరాజు జట్టు ఏ విభాగంలో స్వర్ణం గెలిచింది?

    1. Aమహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌
    2. Bమహిళల 25 మీటర్ల పిస్టల్‌
    3. Cమహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌
    4. Dమహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: B. మహిళల 25 మీటర్ల పిస్టల్‌

    భారత జట్టు 1761 పాయింట్లు సాధించింది. దక్షిణ కొరియా (1748) రజతం, వియత్నాం (1745) కాంస్యం దక్కించుకున్నాయి. జట్టులో ఇషా సింగ్‌ అత్యధికంగా 590 పాయింట్లు సాధించింది.

    ఈ అంశం, మా కథనం
  5. ప్రశ్న 5 / 10
    • APPSC
    • DSC/TET
    • పోలీస్

    ఏపీలో CPS ఉద్యోగులు పాత పెన్షన్‌ పథకానికి మారాలంటే, ఏ తేదీకి ముందు నియామక ప్రకటన వెలువడి, ఆ తేదీన లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ఉండాలి?

    1. A2004 జనవరి 1
    2. B2004 ఏప్రిల్‌ 1
    3. C2004 సెప్టెంబరు 1
    4. D2005 జనవరి 1
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: C. 2004 సెప్టెంబరు 1

    రాష్ట్రం 2004 సెప్టెంబరు 1 నుంచి నియమితులైన అందరికీ CPS అమలు చేసింది. కేంద్ర ఉద్యోగులకు జాతీయ పెన్షన్‌ విధానం 2004 జనవరి 1 నుంచి వర్తిస్తోంది. ఆప్షన్‌ ఇవ్వడానికి చివరి తేదీ 2026 డిసెంబరు 31.

    ఈ అంశం, మా కథనం
  6. ప్రశ్న 6 / 10
    • TGPSC
    • బ్యాంకింగ్
    • SSC

    తెలంగాణలో సుమారు ఎన్ని మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించారు?

    1. A165
    2. B265
    3. C365
    4. D465
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: C. 365

    31 జిల్లాల్లోని సుమారు 365 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని, యాసంగికి రూ.38,268 కోట్ల కొత్త రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి బ్యాంకులను కోరారు.

    ఈ అంశం, మా కథనం
  7. ప్రశ్న 7 / 10
    • UPSC
    • SSC
    • APPSC
    • TGPSC

    ఇన్‌స్టాగ్రామ్‌ వాడేందుకు కనీస వయసు ఎంత?

    1. A12 ఏళ్లు
    2. B13 ఏళ్లు
    3. C16 ఏళ్లు
    4. D18 ఏళ్లు
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: B. 13 ఏళ్లు

    ఇన్‌స్టాగ్రామ్‌ వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. 16 ఏళ్లలోపు వారి ఖాతాలు ప్రైవేటుగా ఉంటాయి. 18 ఏళ్లలోపు వారని అనుమానం వస్తే పుట్టిన తేదీ ఏదైనా టీన్‌ రక్షణలు వర్తిస్తాయి.

    ఈ అంశం, మా కథనం
  8. ప్రశ్న 8 / 10
    • APPSC
    • పోలీస్
    • SSC

    ఏపీలో బాణసంచా భద్రతకు తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం స్టేట్‌ నోడల్‌ అథారిటీ ఎవరు?

    1. Aప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
    2. Bపోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (DGP)
    3. Cజిల్లా కలెక్టర్‌
    4. Dరాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్‌ జనరల్‌
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: D. రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్‌ జనరల్‌

    ఆయన నెలనెలా శాఖల మధ్య సమీక్ష నిర్వహించి, అమలు నివేదికలను హోం శాఖకు పంపాలి. జిల్లాల్లో కలెక్టరే నోడల్‌ అధికారి; ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు.

    ఈ అంశం, మా కథనం
  9. ప్రశ్న 9 / 10
    • TGPSC
    • పోలీస్
    • SSC

    తెలంగాణలో మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం పొందడానికి రిటైలర్లు ఎవరికి ఇండెంట్‌ పెట్టాలి?

    1. Aజిల్లా పౌరసరఫరాల అధికారి
    2. Bజిల్లా కలెక్టర్‌
    3. Cజిల్లా వ్యవసాయ అధికారి
    4. Dజిల్లా తూనికలు, కొలతల అధికారి
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: A. జిల్లా పౌరసరఫరాల అధికారి

    రిటైలర్లు ఇండెంట్‌ పెట్టాక మిల్లర్ల నుంచి సరఫరా ఏర్పాటు చేస్తారు. ధరలను అదుపులో ఉంచడమే లక్ష్యం.

    ఈ అంశం, మా కథనం
  10. ప్రశ్న 10 / 10
    • APPSC
    • పోలీస్
    • DSC/TET

    ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ ఏ పద్ధతిలో సాగుతుంది?

    1. Aరహస్య బ్యాలెట్‌
    2. Bఈవీఎం
    3. Cపోస్టల్‌ బ్యాలెట్‌
    4. Dచేతులెత్తే పద్ధతి
    జవాబు, వివరణ చూడండి

    సరైన జవాబు: D. చేతులెత్తే పద్ధతి

    ఓటింగ్‌ చేతులెత్తే పద్ధతిలో సాగుతుంది. గుర్తింపు పొందిన పార్టీల సభ్యులు విప్‌ చెప్పినట్లే ఓటు వేయాలి; విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం పోతుంది.

    ఈ అంశం, మా కథనం

ప్రశ్నలు ఎలా తయారవుతాయి

ప్రతి ప్రశ్నకు ఒక్కటే సరైన జవాబు ఉంటుంది. ఆ జవాబు మా కథనంలో లేదా అధికారిక ప్రకటనలో అక్షరాలా ఉన్నదే. ప్రచురించే ముందు మరొకరు మూలం చూసి మళ్లీ జవాబులు సరిచూస్తారు.