Original bilingual journalism · English & తెలుగు
అవసరమైతేనే యాంటీబయాటిక్స్.. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై అవగాహన వారోత్సవాలు ప్రారంభం
ఎడాపెడా వాడకంతో ప్రాణాలు కాపాడే మందులు పనిచేయకుండా పోతున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి హెచ్చరించారు. ప్రపంచ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాలు బుధవారం (నవంబరు 18) దిల్లీలో ప్రారంభమయ్యాయి.

దిల్లీ: జలుబుకీ, చిన్న జ్వరానికీ యాంటీబయాటిక్స్ వేసుకోవడం అలవాటుగా మారిన రోజుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ గట్టి హెచ్చరిక చేసింది. ఎన్నో ప్రాణాలు కాపాడిన మందులు దుర్వినియోగం, అతి వాడకం వల్ల క్రమంగా పనిచేయకుండా పోతున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అన్నారు.
ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అవగాహన వారోత్సవాలు 2026ను ఆరోగ్యశాఖ బుధవారం (నవంబరు 18) దిల్లీలోని కర్తవ్య భవన్‌లో ప్రారంభించింది. సూక్ష్మజీవులు మందులకు లొంగకుండా మారడమే ఏఎంఆర్. దీన్ని అడ్డుకోకపోతే సాధారణ ఇన్‌ఫెక్షన్లకు కూడా చికిత్స కష్టమవుతుందని, దశాబ్దాల వైద్య ప్రగతి వెనక్కి పోతుందని ఆమె హెచ్చరించారు.
మనిషి, జంతువు, పర్యావరణం.. అన్నీ ఒక్కటే
‘ఒకే ఆరోగ్యం, ఒకే కార్యాచరణ: ఏఎంఆర్‌ను ఇప్పుడే అడ్డుకుందాం‘ అనేది ఈ ఏడాది థీమ్. మనుషులు, జంతువులు, పంటలు, ఆహారం, పర్యావరణం.. ఎక్కడ మందులను తప్పుగా వాడినా నిరోధకత పెరుగుతుందని, అందుకే అన్ని రంగాలూ కలిసి పనిచేయాలని శ్రీవాస్తవ అన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా 2025 నవంబరులో ప్రారంభించిన ఏఎంఆర్ జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2.0 (2025-2029), ఎన్‌సీడీసీ నిర్వహిస్తున్న జాతీయ ఏఎంఆర్ నియంత్రణ కార్యక్రమాన్ని ఆమె ప్రస్తావించారు. అవసరమైనప్పుడు, చికిత్స మార్గదర్శకాల ప్రకారమే యాంటీబయాటిక్స్ రాయాలని వైద్యులకు సూచించారు. వారోత్సవాలు నవంబరు 24 వరకు జరుగుతాయి.
More Stories
Lifestyleయాంటీబయాటిక్స్‌కు లొంగని ప్రతి మూడో ఇన్ఫెక్షన్
Lifestyleతెలంగాణ పురుషుల్లో 21.1%, ఏపీలో 18.8% మందికి పొగాకు అలవాటు
Lifestyleఐఐటీఎఫ్ ఆరోగ్య పెవిలియన్‌లో క్షయ పరీక్షలు.. సీపీఆర్ ప్రదర్శనలు
Lifestyleవృద్ధుల సంరక్షణకు ‘శతాయు’.. 30,151 మంది సహాయకులు
Lifestyleప్రపంచ మధుమేహ దినం.. తెలుగు రాష్ట్రాల్లో చక్కెర పైపైకి
Lifestyleక్షయ మరణాలు 38% తగ్గాయి.. దాదాపు పావువంతు కేసులు భారత్‌లోనే
